SBI నుంచి 5447 పోస్టులకు మరో నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..

Update: 2023-11-23 14:23 GMT

దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ(SBI) ఉద్యోగాల భర్తీ కోసం మరో భారీ నోటిఫికేషన్ వదిలింది. ఇటీవలే కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో 8283 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌బీఐ తాజాగా 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(CBO) పోస్టులకు దరఖాస్తులli ఆహ్వనిస్తోంది. వీటిలో ఏపీ, తెలంగాణలకు సంబంధించి 825 పోస్టులు ఉన్నాయి. మొత్తం 5280 రెగ్యులర్ పోస్టులు, 167 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

అర్హతలు

అభ్యర్థులు డిగ్రీ, లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల మేరకు సడలింపులు ఉంటాయి. జనరల్ అభ్యర్థులకు రూ.750 ఫీజు చెల్లించాలి. ఇతరులకు ఫీజు లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. 120 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. 50 మార్కులను ఇంటర్వ్యూకు కేటాయించారు. జీతం నెలకు రూ.36,000 నుంచి రూ.63,840 వరకు ఉంటుంది.

మరిన్ని వివరాలకు ../servlet/RDESController?command=rdm.ServletFileDisplay&app=rdes&partner=mtv&type=20&sessionId=RDWEBMDFK0RLJETZA6EFSL7ABNTYSQFHUJFUU&uid=


Tags:    

Similar News