టీఎస్ ఎంసెట్ లో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజైంది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.
సెప్టెంబరు 2, 3న ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల స్లాట్ బుకింగ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబరు 4, 5న సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 4 నుంచి 7వ తేదీ వరకు విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించనున్నారు. ఇక సెప్టెంబరు 11న బీ ఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి సెప్టెంబరు 24న మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.