50వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ.. అడ్మిట్‌ కార్డులు విడుదల

Update: 2023-07-12 16:22 GMT

ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్(SSC GD Constable) నియామకాల ప్రక్రియలో కీలక అప్డేట్ వచ్చింది. శారీరక సామర్థ్య పరీక్షల అర్హత సాధించిన అభ్యర్థులకు జులై 17 నుంచి వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఈ -అడ్మిట్‌ కార్డులు విడుదల అయ్యాయి. పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులై 30న విడుదల కాగా.. శారీరక సామర్థ్య పరీక్షలకు మొత్తం 3.70 లక్షల మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. వారిలో 1.46 లక్షల మంది వైద్య పరీక్షలకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రిజర్వేషన్లు అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

Tags:    

Similar News