నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జేఈ​ పోస్టులకు SSC నోటిఫికేషన్..

By :  Kalyan
Update: 2023-07-28 11:18 GMT

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. 1324 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు అగస్ట్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, మిలటరీ ఇంజనీర్ సేవలు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ - 431, మిలటరీ ఇంజనీర్ సేవలు - 29, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- 5, సెంట్రల్ వాటర్ కమిషన్ - 188 పెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ - 421 సహా పలు విభాగాల్లో మొత్తం 1324 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆయా పోస్టులను బట్టి అభ్యర్థుల అర్హతలు ఉండనున్నాయి. అక్టోబర్ 9 నుంచి 11వరకు ఎగ్జామ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం SSC నోటిఫికేషన్ చూడొచ్చు.

ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్..

SSC ఇప్పటికే 1876 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అగస్ట్ 15వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 6వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. నాలుగు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, ఢిల్లీ పోలీస్​, సీఆర్పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీలలో పనిచేయాల్సి ఉంటుంది.


Tags:    

Similar News