Telangana job calendar 2024 : వచ్చే నెల నుండి నోటిఫికేషన్లే.. నోటిఫికేషన్లే.. ఏ నెలలో ఏ నోటిఫికేషన్లు అంటే
తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ హామీని నెరవేర్చడానికి సిద్దమవుతుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 5వ తేదీన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. యూపీఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా వచ్చే నెల నుండి నోటఫీకేషన్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న సందర్భంగా ఈ భేటీ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాదిలో విడుదల చేసే నోటిఫికేషన్లను ఓసారి చూస్తే..
2024 ఫిబ్రవరి 1వ తేదీ : TSPSC Group– 1 నోటిఫికేషన్ విడుదల
2024 మార్చి 01వ తేదీ : ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీసు కానిస్టేబుల్స్, యూనిఫాం సిబ్బంది రిక్రూమెంట్ నోటిఫికేషన్ విడుదల
2024 ఏప్రెల్ 01:
TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
జూనియర్ ఎల్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, ఫిజికల్ డీ డైరెక్టర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫారెస్ట్ లెక్చరర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
మొదటి దశ టీచర్ ఉద్యోగాలు ఎస్జీటీ, ఎస్ఏ, హెడ్ మాస్టర్, కిండర్ గార్డెన్ టీచర్, గురుకుల ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
2024 మే 01వ తేదీ :
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అగ్రికల్చర్ ఆఫీసర్, హర్టీకల్చరల్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్టాఫ్ నర్స్, ఇతర నర్సింగ్ ఉద్యోగాలు, హస్పిటల్ హెల్పర్స్, పారామెడికల్ ఉద్యోగాలు, ఫిజియోథెరఫిస్ట్ లు, ఫార్మాసిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్
2024 జూన్ 01న:
టీఎస్సీఎస్‌పీ గ్రూప్ –3,4 ఉద్యోగాలకు నోటిఫికేషన్
వెటర్నరీ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ సూపర్వైజర్,. హర్టీకల్చర్ అసిస్టెంట్స్
AMVI, AO, TPO, AEO, Drug inspector, FSO,
వెటర్నరీ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ సూపర్వైజర్,. హర్టీకల్చర్ అసిస్టెంట్స్
మార్కెటింగ్ అసిస్టెంట్స్, బాయిలర్ ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్
VRO, గ్రామ పంచాయతీ సెక్రటరీ , గ్రామ, మండలలో టెక్నిల్ సిబ్బంది ఉద్యోగాలకు నోటిఫికేషన్
2021 ఆగస్టు 1న :
ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
2024 డిసెంబర్ 1న
గ్రూప్–3, గ్రూప్–4 రెండో దశ నోటిఫికేషన్
AMVI, AO, TPO, AEO, Drug inspector, FSO, వెటర్నరీ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ సూపర్వైజర్,. హర్టీకల్చర్ అసిస్టెంట్, మార్కెటింగ్ అసిస్టెంట్, బాయిలర్ ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్
ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీసు కానిస్టేబుల్స్, యూనిఫాం సిబ్బంది నియామానికి సంబంధించిన రెండో దశ నోటిఫికేషన్
2024 డిసెంబర్ 15వ తేదీ :
TSPSC గ్రూప్–2నోటిఫికేషన్ రెండో దశ నోటిఫికేషన్
జూనియర్ ఎల్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, ఫిజికల్ డి డైరెక్టర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫారెస్ట్ లెక్చరర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఏఎస్ఎస్టీ లైబ్రేరియన్ ఉద్యోగాలకు రెండో సారి నోటిఫికేష న్ ఇవ్వనున్నారు. ఇంకా రెండో దశలో SGT, SA, ప్రధానోపాధ్యాయుడు, KINDER Garden టీచర్, గురుకులలా ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
స్టాఫ్ నర్స్, ఇతర నర్సింగ్ ఉద్యోగాలు, హస్పిటల్ సహయకులు, పారామెడికల్ ఉద్యోగాలు, ఫిజియోథెరఫిస్ట్ లు, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు రెండో దశలో నోటిఫికేషన్