తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే EAMCET పరీక్ష పేరును ప్రభుత్వం మార్చనున్నట్లు సమాచారం. 2017 నుంచి ఎంసెట్ లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్యకోర్సులను నీట్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే ఎంసెట్ లో మెడికల్ లేకపోయినా.. పేరులో మాత్రం M అక్షరం అలానే కొనసాగుతుంది. దాన్ని ఇప్పుడు తొలగించాలని ప్రభుత్వ అధికారులు ప్రతిపాదించారు.
ఈ మేరకు ఎంసెట్ లో మెడికల్ పేరును తొలగిస్తూ.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఎంసెట్ లో M అక్షరాన్ని తొలగించి.. దాని స్థానంలో c పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ స్థానంలో TS EAPCET, TS EPACET పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ P అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తుంన్నందుకు P అక్షరాన్ని జోడిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఏపీలో ఇప్పటికే TS EAPCET అనే పేరు ఖరారైంది.