తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే EAMCET పరీక్ష పేరును ప్రభుత్వం మార్చించి. 2017 నుంచి ఎంసెట్ లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్యకోర్సులను నీట్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే ఎంసెట్ లో మెడికల్ లేకపోయినా.. పేరులో మాత్రం M అక్షరం అలానే కొనసాగుతుంది. దాన్ని తాజాగా తొలగించారు.
ఈ మేరకు ఎంసెట్ లో మెడికల్ పేరును తొలగిస్తూ.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదం తెలపింది. ఎంసెట్ లో M అక్షరాన్ని తొలగించి.. దాని స్థానంలో P పేరును చేర్చారు. ఇక్కడ P అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తుంన్నందుకు P అక్షరాన్ని జోడించారు. అంతేకాకుండా ప్రవేశ పరీక్షల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీల వివరాలను ప్రకటించింది.
➤తెలంగాణ ECET- ఉస్మానియా యూనివర్సిటీ- మే6
➤TS EAPCET- జేఎన్టీయూహెచ్- ఇంజినీరింగ్ మే 9 నుంచి 11 వరకు. అగ్రికల్చరల్ అండ్ ఫార్మా మే 12, 13 వరకు.
➤TS EDCET- మహిత్మా గాంధీ యూనివర్సిటీ- మే 23
➤ TS LAWCET, PGLCET- ఉస్మానియా యూనివర్సిటీ- జూన్ 3
➤ TS ICET- కాకతీయ యూనివర్సిటీ- జూన్ 4, 5.
➤ TS PGECET- జేఎన్‌టీయూహెచ్- జూన్ 6 నుంచి 8 వరకు.
➤ TS PECET- శాతవాహన యూనివర్సిటీ- జూన్ 10 నుంచి 13 వరకు.