TS EDCET: ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చంటే..?

By :  Bharath
Update: 2024-02-10 14:11 GMT

ఎడ్సెట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 23వ తేదీన తెలంగాణ ఎడ్సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఈ పరీక్ష బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు.

షెడ్యూల్ వివరాలు:

• మార్చి 4న ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

• మార్చి 6 నుండి మే 6 వరకు దరఖాస్తుల స్వీకరణ 

• మే 23 న ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది.

కాగా శుక్రవారం (ఫిబ్రవరి 9) సాయంత్రం.. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, పీజీలాసెట్‌ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించి.. జూన్ 3వ తేదీన ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు నిర్వహిస్తారు.

Tags:    

Similar News