Contract Teachers: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం

Update: 2023-08-25 11:51 GMT

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 16 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 567మంది టీచర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతుండగా.. వీళ్లందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆర్తిక మంత్రిత్వ శాఖకు ఆదేశించారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విద్యాశాఖ ఒకట్రెండు రోజుల్లో జారీచేయనుంది. ఈ నిర్ణయంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్ట్ విధానంలో 1264 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

\

Tags:    

Similar News