టీఎస్ ఐ సెట్ పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారు అయింది. జూన్ 29న (గురువారం) ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి ఓ ప్రకటనలో విషయాన్ని వెల్లడించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనెజ్‌మెంట్ విభాగం సెమినార్ హాలులో మధ్యాహ్నం 3.30 గంటలకు.. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారు.
మే 26, 27 తేదీల్లో.. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16 కేంద్రాల్లో.. ఏపీలోని 4 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.