TS Polycet :నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీ ఎప్పుడంటే?

By :  Bharath
Update: 2024-02-15 14:09 GMT

తెలంగాణ విద్యాశాఖ టీఎస్ పాలిసెట్‌ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. పదోతరగతి లేదా దానికి సమాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు.. ప్ర‌స్తుతం ఎస్ఎస్ఎసీ ప‌రీక్ష‌లు రాయనున్న విద్యార్థులు ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి మొదలవనుంది. ఇతర వివరాల కోసం.. https://polycet.sbtet.telangana.gov.in/ అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ కావాలి.

అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 22 వరకు

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి.

పరీక్ష తేదీ: మే 17వ తేదీన

ఫలితాలు: పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత వెలువడుతాయి.

Tags:    

Similar News