తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు సంబంధించి తుది కీ విడుదలైంది. జూన్ 28న ప్రైమరీ కీ విడుదల చేసిన అధికారులు.. జులై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వాటి ఆధారంగా తుది కీ రూపొందించారు. తాజాగా ప్రిలిమ్స్ పరీక్ష ఫైనల్ కీని https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు.
ప్రిలిమ్స్ ఫైనల్ కీలో 3, 4, 5, 46, 54, 114, 128, 135 నెంబరు ప్రశ్నలను డిలీట్ చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 38 ఆన్సర్ ను 3 నుంచి 2, 59వ ప్రశ్న జవాబును 1 నుంచి 3వ ఆప్షన్ కు మార్చినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ పరీక్షలకు 2.32లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్ లో ప్రభుత్వం మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేయనుంది.