BREAKINGS : రేపు గ్రూప్-4 హాల్ టికెట్స్ విడుదల

Update: 2023-06-23 16:28 GMT

తెలంగాణ గ్రూప్ 4 పరీక్షపై కీలక అప్డేట్ వచ్చింది. శనివారం గ్రూప్-4 హాల్ టికెట్స్ విడుదల కానున్నాయి. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 8,180 పోస్టులకు గాను 9.50 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ లీక్ వంటి ఘటనల నేపథ్యంలో... ఈ సారి పరీక్ష నిర్వాహణపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జూలై 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

Tags:    

Similar News