TSPSC : జేఎల్ హిస్టరీ, సంస్కృతం, ఉర్దూ హాల్ టికెట్స్ విడుదల..

By :  Kiran
Update: 2023-09-22 16:00 GMT

హైదరాబాద్‌ : జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల రాత పరీక్షకు సంబంధించి మరికొన్ని సబ్జెక్టుల హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం టీఎస్సీఎస్సీ ఈ నెల 12 నుంచి రాతపరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ మొదటివారంలో కొన్ని సబ్జెక్టులకు సంబంధించి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా మిగిలిన సబ్జెక్టుల హాల్ టికెట్లు వెబ్ సైట్లో పొందుపరిచింది.

సెప్టెంబర్ 29న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, హిస్టరీ, సంస్కృతం పరీక్షలు జరగనున్నారు. అక్టోబర్‌ 3న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీ, ఉర్దూ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఒక అభ్యర్థి రెండు పరీక్షలకు దరఖాస్తు చేస్తే వేర్వేరుగా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి..

అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి.

Junior Lecturer Hall Ticket - 22/2022 అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.

TSPSC ID, డేట్ ఆఫ్ బర్త్, captcha ఎంటర్ చేయాలి

డౌన్లోడ్ పీడీఎఫ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు.



Tags:    

Similar News