TS TET Results : కాసేపట్లో టెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

By :  Kiran
Update: 2023-09-27 02:22 GMT

"తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల ఇవాళ విడుదల కానున్నాయి". (TSTET Results 2023) ఉదయం 10గంటలకు టెట్‌ కన్వీనర్‌ రాధా రెడ్డి రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని అందుబాటులో పెట్టనున్నారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in/లో అందుబాటులోకి ఉంచనున్నట్టు ప్రకటించారు.

ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 సెంటర్లలో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షకు 4,78,055 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1కు 2,69,557 మంది అప్లై చేయగా 2,26,744 (84.12 శాతం) మంది పరీక్ష రాశారు. పేపర్‌-2 కోసం 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,89,963 (91.11 శాతం) మంది అటెండ్ అయ్యారు. పేపర్‌-2తో పోల్చుకుంటే పేపర్‌-1 ప్రశ్నపత్రం సులువుగా వచ్చిందని అభ్యర్థులు చెప్పారు

టెట్‌ అర్హత కాలపరిమితి గతంలో 7 ఏండ్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దాన్ని జీవితకాలం చేశారు. టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News