Apply Now: తెలంగాణ ఎస్సీ గురుకుల కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ సీట్ల భర్తీకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు TSWREIS సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా IIT, NEET తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. 2024 జనవరి 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలు
గ్రూప్‌లు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
మొత్తం సీట్లు: 3,680 (బాలురకు- 1,680.. బాలికలకు- 2,000 ఉన్నాయి).
రిజర్వేషన్: ఎస్సీలకు 75%, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2%, ఎస్టీలకు 6%, బీసీలకు 12%, మైనారిటీలకు 3%, ఓసీ/ ఈబీసీలకు 2% సీట్లు కేటాయించారు. ఎస్సీ-30, ఎస్సీ (కన్వర్టెడ్ క్రిస్టియన్స్)-01, ఎస్టీ-02, బీసీ-05, మైనార్టీస్-01, ఓసీ/ఈడబ్ల్యూఎస్-01 సీట్లు కేటాయిస్తారు.
అర్హత: 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ విద్యార్థులకు).. రూ.1,50,000 (గ్రామీణ విద్యార్థులకు) మించకూడదు.
వయోపరిమితి: 31.08.2024 నాటికి 17 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఎంపీసీ/ బైపీసీ గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష(లెవెల్-1, 2); ఎంఈసీ/ సీఈసీ గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష(లెవెల్-1), రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష- లెవెల్ 1 నిర్వహిస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒకమార్కుకాగా.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష-లెవెల్ 2 నిర్వహిస్తారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వారికి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్-1 రాసినవారిలో 1 : 5 నిష్పత్తిలో స్క్రీనింగ్ టెస్ట్-2కు ఎంపికచేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2024.
హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ తేదీలు: 2024, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 03 తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్క్రీనింగ్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 04, 2024.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tswreis.ac.in/