Alert for students: ఇక ఆ యూనివర్సిటీల డిగ్రీలు చెల్లవు.. ఒకసారి చెక్ చేసుకోండి!

Update: 2023-08-02 16:57 GMT

దేశ వ్యప్తంగా నకిలీ యూనివర్సిటీలు వందల్లో పుట్టుకొస్తున్నాయి. వాటినుంచి డిగ్రీ పొందిన విద్యార్థులు.. కీలక సమయాల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. నకిలీ ఏదో అసలేదో తెలియన అయోమయం చెందుతున్నారు. ఈ క్రమంలో దేశంలోని 20 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గుర్తించింది. ఈ యూనివర్సిటీలకు డిగ్రీలు ఈ ప్రదానం చేసే అధికారం లేదని.. అవి చెల్లవని బుధవారం ప్రకటించింది. యూజీసీ రూల్స్ కు విరుద్ధంగా ఈ సంస్థలు డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయని స్పష్టం చేసింది.

అలాంటి నకిలీ యూనివర్సిటీలు ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్ లో 4, ఆంధ్రప్రదేశ్ లో, వెస్ట్ బెంగాల్ లో రెండోసి ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు గుర్తించింది. వీటి నుంచి తీసుకున్న డిగ్రీలు ఉన్నత విద్యకు, ఉద్యోగ ప్రయోజనాలకు కోసం పనికిరావని తేల్చి చెప్పింది. ఏపీలోని గుంటూరులో కాకుమానువారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలు యూజీసీ నకిలీ యూనివర్సిటీలుగా ప్రకటించింది. ఫేక్ అని తేలిన యూనివర్సిటీ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి... https://www.ugc.gov.in/page/Fake-Universities.aspx




Tags:    

Similar News