Net 2023 Results : నెట్ 2023 ఫలితాలు విడుదల చేయనున్న యూజీసీ

Byline :  Kiran
Update: 2024-01-17 07:59 GMT

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ పరీక్ష నిర్వహించింది. గతేడాది డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 14 వరకు ఈ ఎగ్జామ్స్ జరిగాయి. దేశవ్యాప్తంగా 292 పరీక్షా కేంద్రాల్లో 9,45,918 మంది అభ్యర్థులు నెట్ హాజరయ్యారు. ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలను ఈ రోజు (జనవరి 17) విడుదల చేయనున్నారు.

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 సెషన్‌ రిజల్ట్స్ను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ https://ugcnet.nta.ac.in/ లో చూడొచ్చు. పరీక్ష రాసిన అభ్యర్ధులు అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి యూజీసీ నెట్ రిజల్ట్ చూసుకోవచ్చు.

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 పరీక్షలో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఇచ్చారు. నెగెటివ్ మార్కులు మాత్రం లేవు. ఏదైనా ప్రశ్న తప్పుగా, అస్పష్టంగా లేదా ఒకటికన్నా ఎక్కువ సరైన సమాధానాలు ఉంటే ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే మార్కులు ఇవ్వనున్నారు. ఒక ప్రశ్న తప్పుగా గుర్తించి దాన్ని డ్రాప్ చేస్తే , ఆ ప్రశ్నను ప్రయత్నించిన అభ్యర్థులకు మాత్రమే రెండు మార్కులు ఇస్తారు.

UGC NET Result 2023-24 ఇలా చెక్ చేసుకోండి

యూజీసీ అధికారిక వెబ్‌సైట్‌ https://ugcnet.nta.ac.in/ ను ఓపెన్ చేయాలి. 

యూజీసీ నెట్ డిసెంబర్ ఫలితాలపై క్లిక్ చేయాలి.

అప్లికేషన్ నెంబర్, బర్త్ డే ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

రిజల్ట్ స్క్రీన్పై డిస్ ప్లే అవుతుంది.

రిజల్ట్ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవచ్చు.




Tags:    

Similar News