భార్య భర్తల గొడవల్లోకి దూరి 17 మందికి గాయాలు..

Update: 2023-06-09 16:34 GMT

ప్రతి ఇంట్లో గొడవలు సహజం. కొందరు భార్యభర్తలు అయితే చీటికి మాటికీ గొడవ పడుతూ వెంటనే కలిసిపోతారు. ఇలాంటి మెగుడు పెళ్లాళ్ల గొడవల మధ్య దూరేందుకు ఎవరూ పెద్దగా సాహసించారు. కాని కొన్ని జంటలు తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాయి. ఇలాంటి వారి కారణంగానే కుటుంబాలు విడిపోతాయి. శత్రవులుగా మారి కత్తులు దూస్తారు. తాజా ఓ భార్య భర్త మధ్య జరిగిన గొడవ..కొట్లాటకు దారి తీసింది. ఈ సంఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడి..ఆస్పత్రిలో చేరారు.

రాజస్థాన్ ఝులావర్ జిల్లాలో ఝలావర్ లో గరీబ్ నవాజ్ కాలనీకి చెందిన రాజిక్ అన్సారీ అన్సారీ కాంగ్రెస్ కౌన్సిలర్. అతడి భార్యతో గత కొంతకాలంగా గొడవ పడుతున్నారు. ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. తాజాగా మరోసారి వీరి మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవ పెద్దది కావడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

బంధువులందరూ అక్కడికి చేరాక మరొకసారి ఘర్షణ తలెత్తింది. ఇరువురి బంధువుల ఒకరిని ఒకరు చితక్కొట్టుకున్నారు. రాళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ప్రైవేట్ వాహనాలలోనూ, అంబులెన్స్ లలోనూ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News