పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబంపై కొందమంది ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఈ ఘటనలో 9 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. ఈ ఘటన బుధవారం మలకంద్ జిల్లాలోని బత్కెలా తహసీల్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక లెవీస్ ఫోర్స్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బత్‌ఖెలా ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు.