ఆన్ లైన్ గేమ్ మోజులో పడి స్నేహితుడి ప్రాణం తీసాడో కసాయి. ఆటలో ఓడిపోయాననే క్షణికావేశం.. మృతుడి కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది. చిత్తూరు జిల్లా, పలమనేరులో కొత్త కోర్ట్ బిల్డింగ్ కనుతున్నారు. ఇందులో పనిచేయడానికి వెస్ట్ బెంగాల్ నుంచి కూలీలు వచ్చారు. బుధవారం సాయంత్రం కార్మికులుగా పనిచేస్తున్న సర్కార్, రోనీ కలిసి లూడో గేమ్ ఆడారు. అందులో ప్రతీసారి ఓడిపోతున్నా అనే కోపంలో రోనీ.. పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో సర్కార్ తల పగలగొట్టాడు.
దాంతో తలకు బలమైన గాయం అయిన సర్కార్ ను తోటి కార్మికుడు ఇస్లాం హాస్పిటల్ కు తరలించాడు. సర్కార్ కు తల నుంచి తీవ్ర రక్త స్రావం కాగా.. హాస్పిటల్ చేరగానే ప్రాణాలు కోల్పోయాడు. సర్కార్ మృతితో ఆయన కుటుంబం రోడ్డున పడింది. మొబైల్ గేమ్ ఒకరినికి తిరిగిరాని లోకాలకు పంపగా.. మరొకరిని కటకటాల్లోకి నెట్టింది.