సికింద్రాబాద్ లో భారీ దొంగతనం

Update: 2023-07-12 04:39 GMT

మంచివాడని నమ్మితే...నిలువునా ముంచేశాడు. 5 ఏళ్ళుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు కదా అని ఇంటి తాళాలు చేతిలో పెడితే....ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కోట్ల విలువై నగలను తీసుకుని పరారయ్యాడు. సికింద్రాబాద్ లో జరిగిందీ సంఘటన.

ఇందుకే కాబోలు ఎవ్వరినీ నమ్మకూడదని చాలా మంది చెబుతుంటారు. ఎంతటి నమ్మకస్తులైనా డబ్బులు చూసేసరికి ఎక్కలేని ఆశ పుట్టుకొస్తుంది. సింధి కాలనీ పీజీ రోడ్డులో ఓ అపార్ట్ మెంట్ లో రాహుల్ గోయల్ ఫ్యామిలీ నివాసముంటారు. ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళది ఇనుము వ్యాపారం. అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లోర్ మొత్తం వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళు ఒక వాచ్ మ్యాన్ ని కూడా పెట్టుకున్నారు. నేపాల్ కు చెందిన కమల్ అనే వ్యక్తి వారింట్లో 5 ఏళ్ళుగా వాచ్ మ్యాన్ గా పని చేస్తున్నాడు. మొన్న తొమ్మిదో తారీకున బోనాలపండగ అని ఫ్యామిలీ మొత్తం ఫామ్ హౌస్ బుక్ చేసుకుని వెళ్ళారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు మొత్తం తెరిచి ఉంది. అన్ని గదుల తులపుల తాళాలు బద్దలుకొట్టి ఉన్నాయి.

కమల్ కు ఎప్పటి నుంచో ఆ ఇంటి ఆస్తుల మీద కన్ను ఉన్నట్టుంది. బోనాల పండుగకు యజమానులు వెళతారని ముందే తెలుసుకున్నకమల్ ఆ సమాచారాన్ని నేపాల్ లో తన స్నేహితులు, దొంగలకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళగానే వీళ్ళు వచ్చి ఇంట్లో కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను దోచుకెళ్ళిపోయారు. మొత్తం ఆరుగురు దొంగలు ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు దొంగులు ఆటోలో వచ్చి, దొంగతనం చేసి మళ్ళీ అదే ఆటోలో వెళ్ళినట్టు గుర్తించారు.

దొంగలు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం అంతా చేసుకుని వెళ్ళపోయారు. ముందుగానే బస్సు బుక్ చేసుకున్నారు. దొంగతనం అవ్వగానే బస్సులో పారిపోయారు. ఇప్పటికే పోలీసులు రెండు బృందాలు విమానాలు నేపాల్ సరిహద్దుకు వెళ్ళి దర్యాప్తు చేస్తున్నాయి. నేపాలీ దొంగలను పట్టుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు. వాళ్ళు ఒకసారి సరిహద్దు దాటితే వాళ్ళను ఎవరూ పట్టుకోలేరు. ఒకవేళ పట్టుకున్నా సొమ్ము రికవరీ చేయడం కష్టం. నేపాల్ చట్టాలు అందుకు సహకరించవు. కాబట్టి దొంగలు సరిహద్దులు దాటకముందే పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News