ఏపీ: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం;

Update: 2023-06-12 02:55 GMT



ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు.

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు తెలిసింది. కారు రాజమండ్రి (Rajahmundry) నుంచి విజయవాడ (Vijayawada) వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.



Tags:    

Similar News