ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళల కిడ్నాప్.. అవన్నీ వాస్తవాలే: కేంద్రం

Update: 2023-07-26 17:19 GMT

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రకటించిన మిస్సింగ్ కేసు వివరాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దేశంలో బాలికలు, మహిళల మిస్సింగ్ జాబితాను కేంద్రం ప్రకటించింది. 2019 నుంచి 2021 మధ్య మిస్సైన వాళ్ల వివరాలను కేంద్ర హోంశాఖ రాజ్య సభకు వెల్లడించింది. దీనిపై మంత్రి అజయ్ మిశ్రా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో గడిచిన మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 72,767 మంది అదృశ్యం అయినట్లు తెలిపింది. అందులో 15,994 మంది బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో:

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన మూడేళ్లలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమయ్యారు. 2019లో 2,186 బాలికలు 6,252 మహిళలు అదృశ్యం కాగా.. 2020లో 2,374 బాలికలు, 7,057 మంది మహిళలు మిస్సైయ్యారు. 2021లో ఈ లెక్క భారీగా పెరిగింది. 2021లో 3,358 బాలికలు, 8,969 మంది మహిళలు కనపడకుండా పోయినట్లు కేంద్ర నివేదికలో తెలిపింది.

తెలంగాణలో:

తెలంగాణలో కూడా మిస్సింగ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు హోంశాఖ గణాంకాలు చెప్తున్నాయి. గడిచిన మూడేళ్లలో తెలంగాణలో మొత్తం 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యమయ్యారు. 2019లో 2,849 మంది బాలికలు, 10,744 మహిళలు.. 2020లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు కనిపించకుండా పోయారు. ఇక 2021లో 2,994 మంది బాలికలు 12,834 మంది మహిళలు అదశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి.

పవణ్ కళ్యాణ్ ట్వీట్ వైరల్:

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చర్చల్లోకి వస్తున్నాయి. ఇటీవల ఏపీలో భారీ ఎత్తున మహిళలు, బాలికలు మిస్ కావడానికి వాలంటీర్లు తీసుకుంటున్న డేటానే కారణమని పవణ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ కూడా స్పందించి పవణ్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. కేంద్ర ఇంటలీజెన్స్ వర్గాల సమాచారం పవణ్ కు ఎలా తెలిసిందని ప్రశ్నించాయి. ఆ క్రమంలో పవణ్ చేసిన ఆరోపణల్నే కేంద్రం పార్లమెంట్ సాక్షిగా మిస్సైన మహిళలు, బాలికల వివరాలను బయటపెట్టింది. ఈ విషయాన్ని పవణ్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News