రియలన్స్ జువెల్స్‌లో భారీ దోపిడీ.. వీడియో

Update: 2023-11-10 14:41 GMT

పట్టపగలే ఓ నగల దుకాణంలోకి వెళ్లి భారీ స్థాయిలో నగలు కొట్టేశారు. తుపాకీతో సిబ్బందిని బెదించి షాపును మొత్తం ఊడ్చేశారు. రూ. 15 కోట్ల విలువైన నగలను బ్యాగుల్లో వేసుకుని దర్జాగా వెళ్లిపోయారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగింది. జనసమ్మర్దంతో కిటకిటలాగే రాజ్ పూర్ రోడ్డులోని రిలయన్స్ జువెల్స్ షాపులోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఇద్దరు బయట కాపలా కాయగా, మరొకడు తుపాకీతో సిబ్బందిని బెదిరించి నగలను బ్యాగులో వేయించుకున్నాడు. సిబ్బంది ఏ మాత్ర ప్రతిఘటించుకుండా షెల్ఫుల్లోని నగలను దొంగలకు కట్టబెట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తుండడంతో పోలీసు సిబ్బందిలో సింహభాగం మందిని భద్రతకు మోహరించడం అనువుగా తీసుకున్న దొంగలు పథకం ప్రకారం దోపిడీకి తెగబడ్డారు.


Tags:    

Similar News