టోల్ గేట్‌ తెరవడం ఆలస్యమైందని కొట్టి చంపారు...

Update: 2023-06-05 16:39 GMT

టోల్ గేట్‌ తెరవడంలో ఆలస్యం జరిగిందని...సిబ్బందిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒకరు చనిపోగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో రామనగర్ జిల్లాలోని బీదడి వద్ద ఉన్న టోల్‌గేట్‌లో ఈ ఘటన జరిగింది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదివారం రాత్రి నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. వారు వెళ్తున్న సమయంలో గేట్‌ తెరవడం ఆలస్యమైందని టోల్ సిబ్బందితో గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో స్థానికులు కలుగుజేసుకుని గొడవను శాంతిపజేశారు. అనంతరం వారు కారును టోల్ గేట్ నుంచి కొద్ది దూరంలో ఆపారు. ఈ క్రమంలోనే రాత్రి 12 గంటలకు పవన్ కుమార్ తన సహోద్యోగి అయిన మంజునాథ్‌తో కలిసి భోజనం చేసేందుకు వెళ్లగా హాకీ స్టిక్స్‌తో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో 26 ఏళ్ల పవన్ ప్రాణాలు కోల్పోయాడు. మంజునాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. నలుగురు వ్యక్తులు మైసూరు వైపు వెళ్తుండగా .. ఈ ఘటన జరిగింది

Tags:    

Similar News