ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహా ఘటన.. ఫ్లైఓవర్ వద్ద మహిళ శరీర భాగాలు
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. శ్రద్ధా వాకర్ తరహాలో మరో యువతి హత్యకు గురైంది. తూర్పు ఢిల్లీలోని గీత కాలనీలోనిఫ్లైఓవర్ వద్ద యువతి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భాగాల కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హత్యకు గురైన యువతి ఎవరు..? ఆమెను ఎందుకు చంపారనేది సస్పెన్స్గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతేడాది మే 26న శ్రద్ధ వాకర్ అనే యువతిని ఆమె బాయ్ఫ్రెండ్ అఫ్తాబ్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. తన ఫ్లాట్లోనే ఆమెను చంపి.. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి 18 రోజుల పాటు వాటిని ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.