హైదరాబాద్ నగరంలోని డెంటల్ హాస్సిటల్లో పని చేస్తున్న ఓ నర్సు తన చేతివాటాన్ని చూపింది. ఆస్పత్రికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఓ మహిళ దగ్గరి నుంచి రూ.50 లక్షల విలువైన డైమండ్ ఉంగరాన్ని సైలెంట్‌గా కాజేసింది.అంత వరకు బాగానే ఆ తర్వాత పట్టుబడతానేమోనన్న భయంతో ఏమీ తెలియనట్లు ఉంగరాన్ని వాష్ రూమ్‌లోని కమోడ్‌లో విసిరి ఫ్లష్ చేసింది. విలువైన వజ్రపు ఉంగరం కావడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టడంతో అసలు బండారం బయటపడింది.
జూబ్లీహిల్స్‌లోని ఓ డెంటల్ క్లినిక్‌లో రూ.50 లక్ష విలువైన వజ్రపు ఉంగరం దొంగతనం జరిగింది.ఓ మహిల గత నెల జూన్ 27న క్లినిక్‌కి చికిత్స నిమిత్తం క్లినిక్ వచ్చింది. చికిత్స టైంలో ఆమె వేలికి ఉన్న డైమండ్ రింగ్ తీసి పక్కన ఉన్న ఓ టేబుల్ మీద పెట్టింది. అయితే ట్రీట్మెంట్ అయిన తరువాత ఉంగరాన్ని తీసుకోవడం మరిచిపోయి వెళ్లిపోయింది. ఆ తరువాత ఉంగరం విషయం గుర్తుకు వచ్చి వెంటనే మళ్లీ క్లినిక్‌కి వెళ్లింది. ఉంగరం గురించి క్లినిక్‌లోని సిబ్బందిని అడిగితే ఎవరూ ఏమీ చెప్పలేదు. పైగా ఎవరూ పట్టించుకోకపోవడంతో మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం సిబ్బందిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నర్సు బండారం బయట పడింది.
ఎవరో తన పర్సులో ఉంగరాన్ని టిష్యూలో చుట్టి ఉంచారని, దానిని చూడగానే భయంతో బాత్రూంలో పడేశానని పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ప్లంబర్‌ను పిలిపించి పైప్‌లైన్ నుంచి ఉంగరాన్ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ తరువాత పోలీసులు నర్సును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.