అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్.. ఇద్దరి పరిస్థితి విషమం

Update: 2023-06-01 12:21 GMT

హైదరాబాద్ బాచుపల్లిలోని అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో దాన్ని పీల్చిన ఏడుగురు కార్మికులు అపస్మాకర స్థితిలోకి వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కంపెనీ యాజమాన్యం బాధితులను ఎస్ఎల్జీ హాస్పిటల్ కు తరలించింది. కార్మికుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ లీక్ ఘటనతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.బాచుపల్లిలోని అరబిందో ఫార్మా కంపెనీ యూనిట్ 2లో సాల్వెంట్ గ్యాస్ లీకైనట్లు గుర్తించారు. ఉదయం 9 గంటలకు ఘటన జరిగినట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రేమ్ కుమార్, గౌరీనాథ్, ప్రసాద్ రాజు, విమల, గౌరీ, యాసిన్ ఆలీ, శ్రీనివాస్ రావుగా గుర్తించారు.


Tags:    

Similar News