దేశాన్ని రక్షించే జవాను.. సొంత భూమి కోసం పారాడి హత్యకు గురయ్యాడు
‘పాండవులకు ఐదు ఊళ్ళు కాదుకదా.. సూదిమొన మోపినంత భూమిని కూడా ఈయనని దుర్యోధనుడు భారతంలో అన్నాడట’.. అలా దేశాన్ని రక్షించే జావాను కూడా తన ఆరంగుళాల భూమి కోసం కొట్లాడాడు. న్యాయం చేయాల్సిన పోలీసులు.. మొండి చేయి చూపడంతో.. ఆ పోరాటంలోనే హత్యకు గురయ్యాడు. ఇంతటి అమానవీయ ఘటన జరిగింది బీహార్ లోని ముజప్ఫర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. యాదూ ఛాప్రా గ్రామానికి చెందిన దీపేంద్ర కుమార్ సింగ్ (53) బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ (బీఎస్ఏపీ)లో హవల్డార్ గా పనిచేస్తున్నాడు. పట్నాలో అతని పోస్టింగ్. సెలవులతో గ్రామానికి వచ్చిన దీపేంద్ర.. పక్కింటి వాళ్లు తన 6 అంగుళాల భూమిని ఆక్రమించారని మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది.
ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసిన పక్కింటి వాళ్లు దీపేంద్రపై దాడి చేసి హత్య చేశారు. దీంతో దీపేంద్ర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రహదారిపై ధర్నాకు దిగారు. దీపేంద్ర హత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కుంటుబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. రాహుల్, రాకేష్, శివంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.