Heart Breaking News : లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకయాతన..32 ఏళ్ల మహిళ మృతి
లిఫ్ట్ ఎంత మేలు చేస్తుందో అంతే డేంజర్ అని తాజాగా జరిగిన ఓ సంఘటన నిరూపిస్తోంది . లిఫ్ట్ పని చేసినంత సేపు అంతా బాగానే ఉంటుంది. కానీ ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా లిఫ్ట్ తలుపులు తెరుచుకోక చాలా మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి హృదయ విదారకమైన సంఘటన తాజాగా ఉజ్బెకిస్థాన్‌లో జరిగింది. తాష్కెంట్‌కు చెందిన ఓ 32 ఏళ్ల మహిళా లిఫ్ట్‌లో ఇరుక్కొని దారుణంగా చనిపోయింది . లిఫ్ట్ నుంచి బయటికి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆమె ఆక్రందనలు ఎవరికీ వినిపించలేదు. ఒకటి కాదు రెండు కాదు మూడు రోజులు లిఫ్ట్‌లోనే ఇరుక్కుని నరకయాతన అనుభవించింది ఆ మహిళ. ఆమె ఎంత భయంకరంగా చనిపోయిందో ఎంత నరకం అనుభవించిందో చెప్పేందుకు ఆమె పోస్టుమార్టం నివేదికలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఇంటర్నేషనల్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. తాష్కెంట్‌కు చెందిన ఓల్గా లియోన్ టేవా అనే ఓ 32 ఏళ్ల మహిళ, పోస్టు ఉమన్‌గా పని చేస్తోంది. విధుల నిమిత్తం ఆమె ఓ తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ లోని లాస్ట్ ఫ్లోర్‌కు లిఫ్ట్‌లో వెళ్లింది. ఏమైందో ఏమో తెలియదు ఉన్నట్లుండి లిఫ్ట్ సడెన్‌గా ఆగిపోయింది. సాధారణంగా ఇలా లిఫ్ట్ లో సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు ఏదో ఒక ఫ్లోర్ కు వెళ్లి డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. కానీ ఈ మహిళ విషయంలో అలా జరగలేదు.
డోర్స్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. సాయం చేసేందుకు ఎవరైనా వస్తారు ఏమోనని ఆశగా ఎదురుచూసింది. కానీ సమయం గడుస్తున్నా ఎవరూ రాలేదు. భయంతో పెద్ద పెద్దగా అరిచినా లాభం లేకపోయింది. ఆమె ఆక్రందనలు ఎవరికీ వినిపించలేదు. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ కావడంతో నెమ్మదిగా ఆక్సీజన్ లెవెల్స్ కూడా పడిపోయాయి. దీంతో ఊపిరి ఆడక ఆమె లిఫ్ట్‌లోనే తుదిశ్వాస విడిచింది.
జులై 24న ఆఫీస్ కు వెళ్లిన ఓల్గా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు మూడు రోజుల తర్వాత ఆమె డెడ్ బాడీని గుర్తించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె లిఫ్ట్ లో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక, తీవ్ర ఆందోళన నడుమ భయానికి గురై తుది శ్వాస విడిచినట్లు పోస్టుమార్టం నివేదికలు తెలిపాయి. అయితే, ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుని మూడు రోజులైనా లిఫ్ట్ ఎందుకు వాడకుండా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రమాదమా? లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు.
heart wrenching incident, 32 years old women, uzbekistan ,trapped in lift for 3 days, Elevator, international news, post women, postmartem,