Karnataka Crime : ఈ పాపం ఎవరిది? తల్లైన తొమ్మిదో తరగతి విద్యార్థిని

Byline :  saichand
Update: 2024-01-12 02:44 GMT

హాయిగా తోటి స్నేహితులతో ఆడి పాడాల్సిన వయసులో.. ఓ బాలిక తల్లయింది. ఓ కామాంధుడు ఆ అమ్మాయిపై కన్నేసి 14 ఏళ్ళ వయసులోనే ఆమ్మను చేశాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలో చోటుచేసుకుంది. హాస్టల్‌ ఉంటూ చదువుకుంటున్న తోమ్మిదో తరగతి విద్యార్థిని ఇటీవల సెలవుల్లో ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలో బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు గర్భవతిగా గుర్తించారు, అప్పటికే ఎనిమిది నెలల నిండడంతో ఆపరేషన్ చేసి ప్రసవం చేశారు.

తర్వాత వైద్యులు.. పోలీసులకు సమాచారంతో ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. తర్వాత బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో విచారించగా.. తన సీనియర్‌ విద్యార్థే గర్భం దాల్చడానికి కారణమని చెప్పింది. అనంతరం పోలీసులు ఆ మైనర్ బాలున్ని విచారించగా తనకు ఏం తెలియదని పోలీసులకు చెప్పాడు. దీంతో సరైనా సాక్ష్యాలు లేకుండా మైనర్ ను అరెస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్న పోలీసులు ఆ బాలున్ని వదిలేశారు. అయితే బాలిక మాటల్లో కూడా నిలకడ లేదని... ఆ బాలునుతో పాటు మరో విద్యార్థి పేరు కూడా చెబుతోందని.. దీంతో కేసు విచారణ కష్టంగా మారిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. నిందుతున్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని అందరినీ విచారించి బాధ్యుల్ని గుర్తిస్తామని వెల్లడించారు. ఈ ఘటనతో జిల్లా విద్య అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. బాలిక చదువుతున్న హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపుతుంది

Tags:    

Similar News