హైదరాబాద్‌లో విషాదం చోటచేసుకుంది. బాలానగర్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏం జరిగిందో తెలియదు గానీ. ..బాలానగర్ ఫ్లైఓవర్‌పైకి వచ్చిన అతడు అక్కడి నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. మృతుడు వెల్డింగ్ కార్మికుడు అశోక్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.