సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్లాక్ టవర్ సమీపంలో ఉన్న నవకేతన్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు ఐదో అంతస్తు వరకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.