సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి.. 8మందికి సీరియస్
By : Krishna
Update: 2023-09-12 12:34 GMT
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో అగి ఉన్న ఇసుక లారీని క్వాలిస్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్వాలిస్‌లో మొత్తం11మంది విద్యార్థులు ఉన్నారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థులు సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గా గుర్తించారు.వీరు కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో పరీక్ష రాసి సిద్దిపేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలంలోనే నితిన్ , గ్రీష్మ, నమ్రత అనే ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.