రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు వద్ద బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు భానుప్రకాశ్, నవీన్, నారాయణరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.