విద్యార్థినిని వేధించి.. శానిటైజర్ తాగించి..చివరకు..

Update: 2023-08-02 02:55 GMT

అల్లరి మూకల ఆగడాలకు అంతులేకుండా పోతున్నాయి. వారి పిచ్చి చేష్టల వల్ల కొందరి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా యూపీలో అల్లరి మూకల ఆగడాలకు ఓ విద్యార్థిని బలైంది. వేధించి.. శానిటిటైజర్ తాగించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. పైగా ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడ్డం గమనార్హం.

బరేలీ పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ ఫస్టీయర్ చదువుతోంది. జులై 27న కాలేజ్ నుంచి తిరిగొస్తుండగా.. మఠ్‌ లక్ష్మీపుర్‌ ప్రాంతానికి చెందిన ఉదేశ్ రాథోడ్ ఆమెను అడ్డుకుని.. వేధింపులకు పాల్పడ్డాడు. కాసేపటికి మరో ముగ్గురు అతడికి జత కలిశారు. అయితే అటుగా వచ్చిన బాలిక సోదరుడు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగని కీచకులు విద్యార్థినితో బలవంతంగా శానిటైజర్‌ తాగించారు.

ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కాగా కుటుంబసభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించి చికత్స అందించారు. అయితే నాలుగు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు వదిలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News