విషాదం..తల్లితో సహా ఐదుగురు పిల్లలు సజీవ దహనం

Update: 2023-06-15 12:55 GMT

రాత్రి కావడంతో ఆ ఇంట్లో అందరూ పడుకున్నారు. ఐదుగురు పిల్లలతో కలిసి తల్లి ఇంటిలోపలా నిద్రపోతుండగా..ఆమె భర్త ఆరు బయట నిద్రిస్తున్నాడు. ఇంతలో ఊహించని ప్రమాదం సంభవించింది. ఇంట్లో మంటల చెలరేగి ఐదుగురు పిల్లలు, తల్లి సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్‎లో చోటుచేసుకుంది.

కుశినగర్ జిల్లాలోని ఉర్థ గ్రామంలో బుధవారం రాత్రి సంగీత (38) తన పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె భర్త, అత్తమామలు ఇంటి బయట పడుకున్నారు. ఈ సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరిగి గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. గమనించిన ఆమె భర్త చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేశాడు. వారందరూ కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపల ఉన్న వారిని బయటకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే వారు మృతి చెందారు.

మరణించిన చిన్నారుల వయసు 1 నుంచి 10 సంవత్సరాల మద్య లో ఉంటుందని పోలీసులు తెలిపారు. చిన్నారుల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభాతి తెలిపారు. ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

Tags:    

Similar News