రైలు గాలికి కదిలి ఆరుగురు బలి.. ఒడిశాలోనే..

Update: 2023-06-07 15:00 GMT

ఒడిశాను రైలు ప్రమాదాలు కక్షగట్టినట్టు వెంటాడుతున్నాయి. సిగ్నల్ లోపం వల్ల జరిగిన బాలాసోర్ ఘోర ప్రమాదాన్ని మరకవముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలులు, భారీ వర్షం ధాటికి ఓ గూడ్సు రైలు ముందుకు కదిలి దానికింద తలదాచుకుంటున్న ఆరుగురు రైల్వే కార్మికులు బలయ్యారు. జాజ్‌పూర్‌ జిల్లా కేంద్రమైన జాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం ఘోరం జరిగింది.

రైల్వే స్టేషన్‌లో ఓ గూడ్సు రైలును బోగీలను మరమ్మతుల కోసం కొన్నాళ్లుగా నిలిపి ఉంచారు. కార్మికులు బుధవారం మరమ్మతులు చేయడానికి అక్కడికి వెళ్లారు. అదే సమయంలో పెనుగాలులు వీచి భారీ వర్షం కురిసింది. కార్మికులు బోగీ కింద తలదాచుకున్నారు. ఈదురుగాలులకు బోగీలు ముందుకు కదలడంతో చక్రాల కింద నలిగి అసువులు బాశారు. నలుగురు అక్కడికక్కడికే చనిపోగా క్షతగాత్రుల్లో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు. మరో ఇద్దరని కటక్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలపై నిలిపిన బోగీలకు హ్యాడ్ లాక్స్ ఉంటాయని, మరమ్మతులకో లేకపోతే మరో పనిలో భాగంగానో వాటిని అల్ లాక్ చేయడం వల్ల బోగీలు కదిలాయని అధికారులు చెప్పారు.

Tags:    

Similar News