అమ్మాయిల గదిలో సీక్రెట్ కెమెరా పెట్టిన ఇంటి ఓనర్

Update: 2023-07-12 04:52 GMT

హైదరాబాద్‌లో ఓ ఇంటి ఓనర్‌ వికృతంగా ప్రవర్తించాడు. తన ఇంట్లో అద్దెకుంటున్న యువతి గదిలో రహస్యంగా సీసీ కెమెరా పెట్టి , దుస్తులు మార్చుకునే దృశ్యాలను రికార్డ్ చేశాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరి హైలం కాలనీలో అస్సాంకు చెందిన ఓ యువతి తన సోదరుడు, స్నేహితురాలితో కలిసి రెండు నెలల క్రితం స్థానికంగా ఒక గదిలో అద్దెకు దిగారు. అయితే అమ్మాయి మీద కన్ను పడ్డ ఇంటి యజమాని సమీర్ , ఎంతో తెలివిగా ఎవరికీ అనుమానం రాకుండా అమ్మాయి గదిలో సపరేట్ కరెంట్ మీటర్ బాక్స్ పెట్టాలంటూ ఇటీవల ఆమె గదిలో కరెంట్ బాక్స్ అమర్చి దానిలో రహస్యంగా సీ సీ కెమెరా అమర్చాడు.

కెమెరా వైర్‌ను తన గదిలోని కంప్యూటర్‌కు కలిపాడు.ఈ కెమెరాతో పాటు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మరో నాలుగు కెమెరాలకు సంబంధించిన దృశ్యాలను ప్రత్యక్షంగా చూసుకోవడానికి సెల్‌ఫోన్‌లో యాప్‌ వేసుకున్నాడు. కెమెరాలలో వీడియోలను నిరంతరం రికార్డు చేయడానికి రెండు ప్రత్యేక డిజిటల్‌ వీడియో రికార్డర్‌ లు ఏర్పాటు చేశాడు. వీటిలో ఒకటి యువతుల గదికి అనుసంధానం చేశాడు. యువతులు ఇంట్లోకి రాగానే సలీమ్‌ రహస్య కెమెరా ద్వారా గదిలో ఉన్న వారిని గమనిస్తుండేవాడు.

అమ్మాయి బట్టలు మార్చుకునే దృశ్యాలు చూస్తూ ఆనందిస్తున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఇంటి యజమాని ప్రవర్తనలో మార్పు రావడంతోపాటు.. వారిలో గదిలో ఉన్న బాక్సుపై అనుమానం వచ్చింది. అనుమానించిన యువతులు సోమవారం రాత్రి దానిని తెరిచారు. అందులో కెమెరా ఉండటం చూసి అవాక్కయ్యారు. దాని వైరు యజమాని ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించారు. బాధితులు వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువతి అద్దెకు ఉంటున్న ఇంటి గదిలో కరెంట్ బాక్స్ , సీసీ కెమెరా ఉన్నట్టు పరిశీలించిన పోలీసులు నిందితుడు సమీర్ షేక్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News