దీప్తి మృతి కేసులో బిగ్ ట్విస్ట్..పోలీసుల అదుపులో చెల్లి ?

Byline :  Kiran
Update: 2023-09-01 16:58 GMT

సాఫ్ట్‎వేర్ ఇంజనీర్ దీప్తి మృతి తెలంగాణవ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. దీప్తి చనిపోయిన రోజే ఆమె చెల్లి చందన ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఈ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీప్తి చెల్లెలు చందన, ఆమె బాయ్ ఫ్రెండ్‎ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. . చందన స్నేహితుడు హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారని సమాచారం. అదే విధంగా చందన విదేశాలకు వెళ్ల కుండా ఆమెపై పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీప్తి మృతి కేసులో ఆమె బాడీ పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది.

గత నాలుగు రోజులుగా చందన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రత్యేక టీమ్‎లను ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అందుకే విదేశాలకు పారిపోకుండా లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఈక్రమంలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు సిటీలో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ తో సహా వీరిద్దరికి సహకరించిన కారు డ్రైవర్‌‎ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. చందనతో ఉన్న ఆమె ప్రియుడు హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇద్దరినీ కోరుట్లలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చందనని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇంట్లోకి మందు బాలిళ్లు ఎలా వచ్చాయి? ఇంకెవరైనా మద్యం తాగారా? చందన ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే విషయాలపై పోలీసులు ఆమె నుంచి సమాచారం రాబడుతున్నట్లు సమాచారం.



Tags:    

Similar News