రాజేష్ మృతిపై పోలీసులు క్లారిటీ..

Update: 2023-06-01 13:01 GMT

హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్‌లో సంచలనం సృష్టించిన యువకుడు రాజేష్ అనుమానస్పద మృతిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రాజేష్‌ది ఆత్మహత్యగా తేల్చారు. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి గాయాలు లేవని తేలిందని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరించారు. ఉపాధ్యాయురాలితో పరిచయంపై ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.

ఉపాధ్యాయురాలు మొదట పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. ఆ విషయం రాజేష్ కు కుమారుడు చెప్పడంతో అతడు చనిపోవాలని నిర్ణయించుకుని..ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్ చౌహాన్ తెలిపారు. తాము కలిసి బతకలేమని, ఒకరినొకరు విడిచి ఉండలేమనీ భావించినా వారిద్దరూ..కలిసే చనిపోవాలని అంతకుముందే నిర్ణయించుకన్నట్లు స్పష్టం చేశారు. టీచర్ కుమారుడికి రాజేష్ విషయం తెలిసి..అతడిపై ఒకసారి దాడి చేసినట్లు వెల్లడించారు.

సుజాత నాలుగు రోజుల క్రితం తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ రాజేష్‌కి వాట్సప్‌లో మెసేజ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నువ్వు చనిపోతే తాను కూడా చనిపోతానంటూ సుజాత మెసేజ్‌కు రాజేష్ రిప్లై ఇచ్చాడు. ప్రతి రోజు ఉపాధ్యాయురాలు ఇంటి చుట్టూ రాజేష్ తిరిగినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.

ఒక్క రాంగ్ కాల్ ..రెండు ప్రాణాలు

7 నెలల క్రితం సుజాత ఫోన్ నుంచి రాజేష్‌కు రాంగ్ డయల్‌గా కాల్ వెళ్లింది. ఇలా రాంగ్ డయల్‌తో ఇద్దరికి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరు వాట్సాప్ ద్వారా చాట్ చేసుకుంటూ ఒకరికొకరు దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలి ఇంట్లో విషయం తెలిసి గొడవలు మొదలయ్యాయి. ఆమె కుమారుడు కూడా రాజేష్ పై దాడి చేశాడు. దీంతో టీచర్ పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే రోజు ఇబ్రహీంపట్నం వెళ్లిన రాజేష్ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో సోమవారం హయత్ నగర్ సమీపంలోని కుట్లూరులో రాజేష్ శవమై కనిపించాడు.


Tags:    

Similar News