రేపల్లె రైల్వే స్టేషన్ సామూహిక అత్యాచారం కేసులో సంచలన తీర్పు

Update: 2023-08-09 15:19 GMT

ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‎లో గర్భిణీపై సామూహిక అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. రేపల్లె నగరానికి చెందిన నిందితులు పాలుబోయిన కృష్ణ, పాలుబోయిన విజయ కృష్ణ, పాలుదురి నిఖిల్‌కు శిక్షను ఖరారు చేసింది. నిందితులపై నేరం రుజువు కావడంతో ఏ1, ఏ2కి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా నాలోగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఏ3 మైనర్‌ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. 2022 మే ఒకటో తేదీ అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కేసు నేపథ్యమిదే..

ఉపాధిపనులు నిమిత్తం మరో ప్రాంతానికి వెళ్లే క్రమంలో తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి భార్య రేపల్లె రైల్వే స్టేషన్‌లో నిద్రబోయింది. ఈ క్రమంలోనే ఆమె భర్తతో కావాలనే నిందితులు గొడవపెట్టుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిలో ఇద్దరు ఆమెను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మరొకరు ఆమె భర్తను నిర్బంధించారు. బాధితురాలిని ప్లాట్ ఫాం వరకు ఈడ్చుకుంటూ వెళ్లి భర్త కళ్లెదుటే ఆమె పాశవిక చర్యకు పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. నిందితుల నుంచి అతి కష్టం మీద తప్పించుకున్న భర్త సాయం కోసం పరుగులు తీశాడు. తన భార్యను కాపాడాలంటూ రైల్వే పోలీస్ కార్యాలయం వద్ద కేకలు పెట్టాడు. ఫలితం లేకపోవడంతో బయటకు వెళ్లి సాయం కోరినా నిరాశే ఎదురైంది. దీంతో ఇద్దరు పిల్లల్ని అక్కడే వదిలేసి ఓ బిడ్డను భుజాన ఎత్తుకుని ఆ అర్ధరాత్రి వేళ భార్యను రక్షించుకోవటానికి పరుగున పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమాచారమందించాడు. పోలీసులు వచ్చిన సమయంలో కూడా బాధితురాలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడుతునే ఉన్నారు.

Sensational verdict in Raypalle railway station case

Sensational verdict, Raypalle railway station, case, gunturu court

Tags:    

Similar News