బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

Update: 2023-06-13 11:34 GMT

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా, కోటపల్లి మండలానికి చెందిన దీపిక పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఆమె అడ్మినిస్ట్రేటివ్‌ భవనం బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే దీపికను సిబ్బంది భైంసా ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే దీపిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ ఉదయమే ఫిజిక్స్‌ పరీక్ష రాసిన ఆమె అనంతరం ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా టాసర ట్రిపుల్ ఐటీలో అనుమానస్పద స్థితిలో పలువురు విద్యార్థులు మృతి చెందారు.

Tags:    

Similar News