చిన్నారుల కోసం ఊరంతా వెతికారు.. కానీ ఇంటిపక్కన కారులోనే..

Update: 2023-06-19 06:26 GMT

ముగ్గురు చిన్నారులు వారి ఇంటి వద్దే ఆడుకుంటున్నారు. సడెన్గా వారు కన్పించకుండా పోయారు. తల్లితండ్రులు చుట్టూ వెతికినా లాభం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. చివరకు ఇంటి దగ్గరే ఉన్న ఓ కారులో చిన్నారులు కన్పించారు. కానీ అప్పటికే వారు చినిపోయి ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగింది.

నాగ్‌పుర్‌ లోని పచ్‌పోలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ దంపతులకు తౌఫిఖ్‌ ఫిరోజ్‌ ఖాన్‌(4), అలియా ఫిరోజ్‌ ఖాన్‌(6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు శనివారం మధ్యాహ్నం సమయంలో ఫ్రెండ్ ఆఫ్రిన్తో కలిసి ఇంటిబయట ఆడుకోవడానికి వెళ్లారు. రాత్రి అవుతున్నా వారు ఇంటికి వెళ్లలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు.

ఆదివారం వరకు కూడా చిన్నారుల ఆచూకీ దొరకలేదు. చివరకు ఇంటి సమీపంలో పార్క్ చేసిన కారులో చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. డోర్ తెరిచి చూడగా ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు ఆడుకునే క్రమంలో కారులో ఎక్కగా.. ఆ తర్వాత లాక్ పడిపోవడం వల్ల ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మృతికి గల వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

Tags:    

Similar News