గుంటూరు జిల్లాలో విషాదం..ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురి మృతి

Update: 2023-06-05 09:17 GMT



ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన, మరణించిన వారంతా కూలీలుగా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు సంఘటన స్థలంలోనే చనిపోయారు. గాయపడినవారిని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరో ఇద్దరు మరణించారు. మొత్తం 40 మంది ఈ ట్రాక్టర్‎లో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News