బోయిన్పల్లిలో విషాదం.. తల్లి సహా ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య

Update: 2023-06-13 14:58 GMT

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో విషాదం నెలకొంది. భవానీనగర్లో తండ్రి చనిపోయాడన్న బాధతో తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. విజయలక్ష్మీ, తన భర్త, ఇద్దరు కూతుళ్లతో కలిసి భవానీనగర్లో నివసిస్తోంది. అయితే ఇటీవలె ఆమె భర్త మరణించాడు. దీంతో విజయలక్ష్మీ డిప్రెషన్లోకి వెళ్లింది. ఈ క్రమంలో తల్లి విజయలక్ష్మి, ఎంబీఏ చదువుతున్న కూతురు చంద్రకళ, వికలాంగురాలైన మరో కూతురు సౌజన్య ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. విషయం బయటకు రాకుండా పోలీసులు, కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాకు తరలించారు. గతంలో కూడా వీరు నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News