బిడ్డను అడ్డం పెట్టుకుని.. రైల్లో తల్లిపై అఘాయిత్యం

Update: 2023-08-08 03:36 GMT

అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్తున్న సిఫాంగి ఎక్స్ప్రెస్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్లో ఎవరూ లేనిది చూసిన ఇద్దరు ప్రయాణికులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. గువహటిలో శనివారం మధ్యహ్నం ఆ మహిళ తన చంటి బిడ్డతో రైలు ఎక్కింది. ఫకీరాగ్రామ్ చేరుకునే సమయానికి రైలు బోగీలన్ని ఖాళీ అయిపోయాయి. అదే బోగీలో ప్రయాణిస్తున్న అస్సాంకు చెందిన అబ్దు (25), మొయినుల్ హక్ (26) మహిళపై లైంగిక దాడి చేశారు. మొదట తనను కట్టేసి కొట్టారు. తర్వాత తమకు సహకరించకపోతే తన బిడ్డను రైల్లో నుంచి కింద పడేసి చంపేస్తామని బెదిరించారు. ఆతర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డారు. రైలు అలీపుర్ ద్వార్ చేరుకోగానే బాధిత మహిళ రైల్వే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బృందాలుగా విడిపోయి నిందితుల గురించి గాలించిన పోలీసులు శనివారం రాత్రి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News