వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు.. డ్రగ్స్ దందాలో సినీ నిర్మాత

By :  Bharath
Update: 2023-09-14 13:44 GMT

హైదరాబాద్ లో మహానగరంలో టిఫిన్ సెంటర్ ముసుగులో డ్రగ్స్ దందా జరిగింది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యాజమాన్యం ఓపెన్ గా డ్రగ్స్ విక్రయించడం సిటీలో కలకలం రేపింది. యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ సరఫరా చేసిన ముగ్గురు నైజీరియన్లతో పాటు పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 50 గ్రాముల MDMA తో పాటుగా, ఎనిమిది గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

కాగా దీని వెనుక సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ సినీ నిర్మాత కూడా ఉన్నట్లు తాజా విచారణలో తేలింది. కొన్నిరోజుల క్రితం సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళి కలిసి ఓ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి సంబంధింన విషయం తెలుసుకున్న పోలీసులు పార్టీని భగ్నం చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు తరలించి విచారించగా.. ఈ దందాలో సినీ ఇండస్ట్రీకి చెందిన 18 మంది ప్రముఖులు, మరికొంతమంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఫైనాన్షియర్ వెంకట్ ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు.



telangana,hyderabad,Varalakshmi Tiffin Center,drugs case,film producer,Bureau of Narcotics Control,Varalakshmi Tiffin Center drugs case update,financier venkat

Tags:    

Similar News