దేశంలో క్యూనెట్ అరాచకాలు కొనసాగుతున్నాయని ఐపీఎస్ అధికారి , తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు.పెట్టుబడి పేరుతో క్యూనెట్ సంస్థ మోసాలకు పాల్పడుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్నిన్ననే ప్రకటించారు.అరెస్ట్ చేసిన మరునాడే ఈ విషయమై వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోసపూరిత క్యూనెట్ వ్యవహరంపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. స్వప్నలోక్ ఘటనలో ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారని సజ్జనార్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆర్గనైజర్లతో పాటు ఏజెంట్లనూ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్ అరెస్ట్ చేయాలి. మోసపూరిత క్యూనెట్ కంపెనీ కార్యకలపాలపై సమగ్ర విచారణ జరపాలి. ఆ సంస్థను తక్షణం మూసివేసి ఆస్తులన్నీ జప్తు చేయాలి. గొలుసు కట్టు పద్ధతిలో అమాయకులను టార్గెట్ చేసుకుని..మోసం చేస్తున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు సజ్జనార్.